Spirit: ఒక్క లైక్‌తోనే.. 'స్పిరిట్' వివాదంపై స్పందించిన దీపికా పదుకొణె!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా నుంచి దీపికా పదుకొణె వైదొలగిన అంశంపై గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ చేసిన వ్యాఖ్యలతో ఆ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రణయ్.. దీపిక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. షూటింగ్ డేట్స్ సర్దుబాటు చేయడంలో ఇబ్బందులతో పాటు, ఆమె భారీ పారితోషికం కోరారని చెప్పారు. అంతేకాకుండా సినిమా లాభాల్లో 10 శాతం వాటా కూడా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్క రోజులోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
వివరాలు
స్పందించిన దీపికా..
ఈ వివాదంపై దీపిక నేరుగా స్పందించకపోయినా, సోషల్ మీడియాలో చేసిన ఒక చర్య ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ఆమె లైక్ చేయడం చర్చనీయాంశమైంది.
ఆ పోస్ట్‌లో.. "ఒక మహిళ ఇలాంటి డిమాండ్‌లు చేస్తే సహించలేకపోతున్నారు.
ఆమె 'నో' చెప్పడాన్ని ఈగో సమస్యగా మార్చారు. ఇది పురుషాధిక్య అహంకారానికి నిదర్శనం" అని పేర్కొన్నారు.
ఆ పోస్టును దీపిక లైక్ చేయడాన్ని నెటిజన్లు ఆమె పరోక్ష స్పందనగా భావిస్తున్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్..
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రంలో తొలుత హీరోయిన్‌గా దీపికా పదుకొణెనే ఎంపికయ్యారు.
ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సందీప్ ఆమెతో దాదాపు ఏడాదిన్నర పాటు పని చేసినట్లు సమాచారం.
అయితే అనంతరం ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రీని ఎంపిక చేశారు.
అప్పట్లో దీపిక కథను లీక్ చేశారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.