Drishyam 3: విమర్శలు వచ్చినా తగ్గని జోరు.. 'దృశ్యం 3'కు భారీ వసూళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం 3' ఈ నెల 21న థియేటర్లలో విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం' సిరీస్‌ను తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం మలయాళ వెర్షన్‌కే తెలుగు డబ్బింగ్ చేసి విడుదల చేయడం విశేషంగా మారింది. కథపై ఉన్న క్రేజ్ కారణంగా థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి బాగానే కనిపించింది. విడుదలైన తర్వాత 'దృశ్యం 3'కు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
తొలి వారంలోనే రూ.200 కోట్ల వసూలు
అయితే ఆ అనుమానాలన్నింటినీ పక్కనబెడుతూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలోనే రూ.200 కోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. సినిమాపై వచ్చిన మిశ్రమ స్పందనను పరిశీలిస్తే, ఈ స్థాయి కలెక్షన్లు రావడం నిజంగా విశేషమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో స్క్రీన్‌ప్లేతో జీతూ జోసెఫ్ ప్రేక్షకులను అబ్బురపరిచారు. ముఖ్యంగా ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. అయితే అదే స్థాయి మ్యాజిక్‌ను 'దృశ్యం 3'లో ఆయన చూపించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వివరాలు
ఓటీటీలో విడుదలపై చర్చ
ముఖ్యంగా సెకండాఫ్ కోసం ఫస్టాఫ్‌ను నెమ్మదిగా లాగించారనే కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ గత రెండు భాగాలపై ప్రేక్షకుల్లో ఉన్న బలమైన అభిమానమే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా చర్చ నడుస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలి వారంలో ఈ చిత్రం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.