Page Loader
Devara: "తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.." బ్లాక్ బస్టర్ దేవర ప్రోమో విడుదల
బ్లాక్ బస్టర్ దేవర ప్రోమో విడుదల

Devara: "తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.." బ్లాక్ బస్టర్ దేవర ప్రోమో విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన "దేవర"(Devara)చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కింది. ఈ సినిమాకి కొరటాల శివ(Siva Koratala)దర్శకత్వం వహించారు. "దేవర" పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతానికి సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా సెంటర్లలో బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ "బ్లాక్ బస్టర్ దేవర" ప్రోమోను విడుదల చేశారు.

వివరాలు 

ప్రోమోలో దేవర కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు 

జాన్వీ కపూర్ ఆకర్షణీయంగా కనిపిస్తూ,"అందాలు ఆరబోస్తూ తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా?" అనే డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమవుతుంది.సముద్రంలో దేవర గ్యాంగ్ చేసే ప్రయాణం,ఆయుధాల కోసం జరుగుతున్న పోరాటం,దేవర కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రోమోలో చూపించబడ్డాయి.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రలో కనిపించగా, ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ వంటి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్లాక్ బస్టర్ దేవర ప్రోమో విడుదల