Page Loader
Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ. 220 కోట్లు గ్రాస్‌ 
'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ. 220 కోట్లు గ్రాస్‌

Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ. 220 కోట్లు గ్రాస్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ భారీ చిత్రాలు తీయడం సాధారణమైంది. అలాంటి సినిమాల జాబితాలో ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'దేవర' కూడా చేరింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్‌ ఎన్టీఆర్, ఈసారి 'దేవర'తో మరో భారీ హిట్‌ సాధించాడు. హై యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ రెస్పాన్స్‌ అందుకుంటోంది. వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా 'దేవర' కేవలం రెండు రోజుల్లోనే ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దేవర'. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించగా, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయక పాత్ర పోషించాడు.

Details

తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్

శ్రీకాంత్‌, ప్రకాశ్‌ రాజ్‌, అజయ్‌ వంటి ప్రాముఖ్య పాత్రల్లో నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుథ్‌ సంగీతం అందించారు. 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్‌ చేసింది. నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 46.55 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 112.55 కోట్ల బిజినెస్‌ నమోదైంది. దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల్లో కలిపి, రూ. 182.55 కోట్ల ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. హిందీ, ఇతర భాషల్లోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్‌ ఏర్పడింది.

Details

110 కోట్లతో షేర్ సాధించిన 'దేవర'

'దేవర' సినిమా తొలి రోజు అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. రెండు రోజులకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల షేర్‌ వసూలు చేసింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మరో రూ. 10 కోట్లు రాబట్టింది. రెండో రోజుకి మొత్తం రూ. 26 కోట్ల షేర్‌ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 110 కోట్ల షేర్‌తో పాటు, ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది.