Devara: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్.. 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూసిన చిత్రం 'దేవర'. ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్‌ని వెండితెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే పలు రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల పరంగా టాప్‌లో నిలిచి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా రూ. 77 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలకు తెలిపిన కొరటాల శివ
ఈ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 68 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. 'దేవర'ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన అభిమానుల ప్రేమాభిమానాలు చూస్తుంటే తన మనసు నిండిపోయిందని, ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివ కూడా ఈ విజయంపై తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని చాలా మంది మెచ్చుకుంటున్నారని, ఈ విజయం తకెంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.