NTR: క్యాన్సర్ బాధితుడికి ధైర్యం చెప్పిన దేవర
అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్, తన చివరి కోరికగా తారక్ నటిస్తున్న 'దేవర' సినిమాను చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కౌశిక్ తల్లిదండ్రులు, తమ కుమారుడి వైద్యానికి భారీ ఖర్చు అవుతున్నందున సాయం చేయాలని ప్రభుత్వాన్ని, దాతలను కోరారు.
జాగ్రత్త అంటూ అని భరోసానిచ్చిన ఎన్టీఆర్
ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, కౌశిక్‌కు వీడియో కాల్ చేసి, అతడికి ధైర్యం చెప్పారు. నువ్వు ముందు కోలుకోవాలని, 'దేవర' సినిమా అనేది తర్వాత విషయమని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. అన్నా.. మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా, ఎన్టీఆర్ ఆప్యాయంగా నేను మాట్లాడకపోతే ఎలా, నువ్వు నాకు చెప్పవు కదా అంటూ స్నేహపూర్వకంగా స్పందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. ఆయన అభిమానుల పట్ల చూపిస్తున్న ప్రేమ మరోసారి అభిమానుల హృదయాలను కదిలించింది.