
Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్‌లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా, విడుదలకు ముందే ఓవర్సీస్‌లో సంచలన రికార్డును సాధించింది.
ఇటీవల ఓవర్సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే.
'దేవర' సినిమా ట్రైలర్ విడుదలకు ముందు నుంచే ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ను చేరింది. ప్రీసేల్ ద్వారానే ఈ ఘనత సాధించి మరింత హైప్‌ను పెంచింది.
Details
జోరుగా దేవర ప్రమోషన్స్
'దేవర' ట్రైలర్ రిలీజ్ కాకముందే, నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
ట్రైలర్ విడుదల తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ముంబయిలో 'దేవర' ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.
ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.