తదుపరి వార్తా కథనం

Devara: 'దేవర' మూవీ షూట్ లో ఎన్టీఆర్ లుక్ వైరల్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 22, 2024
01:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
ఈ సందర్భంగా షూటింగ్ సెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోను మేకర్స్ షేర్ చేశారు. గత రెండు రోజులుగా ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
రింగుల జుట్టుతో మెరూన్ షర్ట్ ధరించిన తారక్ లుక్ అక్కటుకుంటోందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేవర మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Making waves in Goa !! 🌊🎵 #Devara pic.twitter.com/EDnY5DApGk
— Devara (@DevaraMovie) March 22, 2024