Page Loader
Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్‌ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా 

Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్‌ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన మూడు సాంగ్స్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ ట్రైలర్‌‌లో సంచలనం సృష్టించింది.

Details

ఇవాళ సాయంత్రం 'దేవర' ఫ్రీ రిలీజ్ ఈవెంట్

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. కొత్త ట్రైలర్‌లో "భయం పోవాలంటే దేవుడి కథ వినాలా - భయం రావాలంటే దేవర కథ వినాల" అంటూ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 'దేవర' ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్, ఎస్ ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ హాజరు కానున్నారు. దేవరపై భారీ క్రేజ్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలను పెంచేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.