Page Loader
Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు 
దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు

Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర-పార్ట్ 1. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కొరటాట శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త అందింది. పార్ట్ 1లో తన షూటింగ్ పూర్తియైనట్లు తారక్ ప్రకటించారు. ఈ మేరకు ఇదే తన చివరి షాట్ అంటూ మంగళవారం రాత్రి ఎన్టీఆర్ ఓ పోస్టు చేశారు.

Details

సుమద్రమంత ప్రేమను పొందాను

దేవర పార్ట్ 1లో నా చివరి షాట్ పూర్తయింది. ఇదోక అద్భుతమైన ప్రయాణం. తాను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమ్ మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండలేకపోతున్నాను అని ఎన్టీఆర్ తన 'ఎక్స్' లో ట్వీట్ చేశారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ జనవరి 6, 2026లో రిలీజ్ కానున్నట్లు ఈ మధ్యే మేకర్స్ ప్రకటించారు. ఇదే కాకుండా వార్ 2 మూవీతో బాలీవుడ్ లోనూ తారక్ అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.