Page Loader
Devara: 'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం
'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం

Devara: 'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' పై భారీ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దేవర' పాటలు యూట్యూబ్‌లో విడుదలవడంతో, ఆ పాటలు ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండటం విశేషం. 'దావూదీ' (తెలుగు) పాట మొదటి స్థానం దక్కించుకోగా, 'దావూదీ' (హిందీ) ఏడవ స్థానంలో నిలిచింది. ఇక 'చుట్టమల్లె' (తెలుగు) 18వ స్థానం, 'దావూదీ' (తమిళ్) 25వ స్థానంలో నిలిచాయి. ఈ విజయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

Details

నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూలు

'దేవర' విడుదలకు ముందే పలు రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించే తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. నార్త్ అమెరికాలో ప్రీసేల్ ద్వారా 1 మిలియన్ డాలర్లను అత్యంత వేగంగా సాధించిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.