Devara: 'దేవర' నుండి కీలక అప్డేట్.. ఎల్లుండే మూడవ సింగిల్ 'దావూది' విడుదల
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న "దేవర" సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ "ఆర్ఆర్ఆర్" తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టు కావడం, అలాగే "ఆచార్య" చిత్రంతో నిరాశపరిచిన కొరటాల శివ తదుపరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతూ ఉంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, రెండు పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మేకర్లు "దావుడి" అనే మూడో పాటను సెప్టెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఈ మూడో పాట జూనియర్ ఎన్టీఆర్,జాన్వి కపూర్ మధ్య మాస్ బీట్‌గా ఉండబోతోందని సమాచారం.
125 మిలియన్ వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన "చుట్టమల్లే"
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మెలోడీ సాంగ్ "చుట్టమల్లే" ఇప్పటికే 125 మిలియన్ వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మాస్ సాంగ్ రూపంలో వచ్చిన ఈ కొత్త సాంగ్ ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది. కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తుండగా, వివిధ భాషలకు చెందిన స్టార్ నటీనటులు కూడా ఇందులో కనిపించబోతున్నారు.