Page Loader
Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?
ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, మూడు సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందన లభించింది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ల మీద దృష్టి సారించింది.

Details

ఈనెల 10న ట్రైలర్ రిలీజ్?

ఈనెల 10న ముంబైలో ట్రైలర్ విడుదల చేస్తారని, ఇందులో మూవీ టీం కూడా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని టాక్. యూట్యూబ్‌తో పాటు కొన్ని థియేటర్స్‌లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించాలని మూవీ టీమ్ భావిస్తోందట. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.