Page Loader
Devara: దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్
దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

Devara: దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 22, 2024
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అయితే, దేవర సెట్స్ నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. జూనియర్.ఎన్టీఆర్ పై గోవాలో దేవరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు జాన్వీ కపూర్ కూడా లొకేషన్‌కు చేరుకుంది. అయితే, గోవాకు దేవర సెట్స్ నుండి ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. వైరల్ వీడియోలో,జూనియర్ ఎన్టీఆర్ బీచ్ ఒడ్డుకు వెళుతున్నట్లు చూడవచ్చు. గోవాలో యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని,వీటికోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ పనిచేస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది.

Details 

దేవరలో విలన్‌‌గా సైఫ్ అలీఖాన్ 

దేవర మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవరలో తండ్రీకొడుకులుగా నటించనున్నాడు దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌‌గా కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 2016 లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న జనతా గ్యారేజ్ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ కి ఇది రెండో సినిమా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లీక్ అయ్యిన వీడియో ఇదే ..