NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devi Shri Prasad : దేవి-మైత్రీ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి
    తదుపరి వార్తా కథనం
    Devi Shri Prasad : దేవి-మైత్రీ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి
    దేవి-మైత్రీ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి

    Devi Shri Prasad : దేవి-మైత్రీ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 27, 2024
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

    మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    ఇటీవల చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

    మనకు కావలసినది అడగాలని, అది నిర్మాతల దగ్గర నుండి వచ్చే పేమెంట్ అయినా సరే లేదా స్క్రీన్ మీద వచ్చే క్రెడిట్ అయినా సరే అని వ్యాఖ్యానించాడు.

    ముఖ్యంగా మైత్రీ నిర్మాత రవిని ఉద్దేశిస్తూ లేట్ అని అనవద్దు అని, ప్రతీదీ లేట్ అని ట్యాగ్ చేయడం మంచిది కాదని చెప్పాడు.

    Details

    దేవి మాటల్లో తప్పు లేదు

    దీంతో దేవి ప్రసాద్, మైత్రీ నిర్మాతల మధ్య విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు వినిపించాయి. ఇకపై మైత్రీ బ్యానర్ నుంచి దేవికి అవకాశాలు రావంటూ కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.

    తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ హీరోగా నిర్మిస్తున్న 'రాబిన్ హుడ్' ప్రెస్ మీట్ సందర్భంగా, నిర్మాత రవి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

    దేవి మాటల్లో ఎటువంటి తప్పు లేదని, ప్రొడ్యూసర్‌లకు నా మీద లవ్ కూడా ఉంటుందని, కంప్లైంట్స్ కూడా ఉంటాయని, అయితే ఈ మధ్య ఎక్కువగా విన్పిస్తున్నాయని చెప్పారు.

    అంతేకాకుండా తమకు దేవితో ఎటువంటి సమస్య లేదని, భవిష్యత్తులో దేవి ప్రసాద్‌తో కలిసి తాము మరిన్ని సినిమాలు చేస్తామని రవి పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవి శ్రీ ప్రసాద్
    పుష్ప 2

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    దేవి శ్రీ ప్రసాద్

    69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..   జాతీయ చలనచిత్ర అవార్డులు
    Allu Arjun: 'పుష్ప'కు అవార్డుల పంట .. జాతీయ ఉత్తమ నటుడిగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ

    పుష్ప 2

    Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన టీమ్  సినిమా
    'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా
    Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్ అల్లు అర్జున్
    Pushpa 2: 'పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025