Page Loader
Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఏమిటో తెలుసా
Devil Movie : కళ్యాణ్ రామ్ డెవిల్ వాయిదా.. కారణం ఏమిటో తెలుసా

Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఏమిటో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 01, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం డెవిల్ మరోసారి వాయిదా పడింది. కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డెవిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తటపటాయిస్తోంది. కళ్యామ్ రామ్, సంయుక్త మీనన్‌ జోడిగా భారీ అంచనాలతో తెరకెక్కిన డెవిల్ సినిమా విడుదల వాయిదా పడింది. తొలుత నవంబరు 24న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం డెవిల్ రెండో భాగం ఆర్ఆర్ పూర్తి కాలేదు. ఇదే సమయంలో సిజీ పనులు సైతం పూర్తి కావాల్సి ఉంది.

DETAILS

త్వరలోనే మరో కొత్త డేట్‌ ప్రకటన

అయితే ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో నవంబర్ 24లోగా మిగతా పనులు పూర్తి అయ్యే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాని వాయిదా వేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే మరో కొత్త డేట్‌ని ప్రకటిస్తామని చెప్పారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాకు బాణీలు సమకూర్చే పనిలో ఉన్నారు. కళ్యాణ్ రామ్ గత హిట్టు సినిమా బింబిసార, సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. దీని తర్వాత వచ్చిన అమిగోస్ నందమూరి యంగ్ హీరోని ఢీలా పడేసింది. త్వరలోనే 'డెవిల్' థియేటర్లలో సందడి చేయనుంది.