
Dhanush-Aiswarya Divorced: కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్..ఐశ్వర్య దంపతులు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ కథనాయకుడు ధనుష్ (Dhanush), ఆయన భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aiswarya Dhanush) విడాకుల కోసం దరఖాస్తు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
రెండేళ్ల క్రితమే తామిద్దరం విడిపోతున్నామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే మధ్యలో రజనీకాంత్ మాట్లాడి నచ్చజెప్పడంతో ఇప్పటివరకు వీరు కలిసి ఉన్నట్లు గతంలోనే కథనాలు వెలువడ్డాయి.
కానీ ఇప్పుడు మాత్రం వీరికి విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
సెక్షన్ 13 బీ కింద పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు వారి సన్నిహిత వర్గాల ద్వారా మీడియాకు విషయం వెల్లడైంది.
త్వరలోనే వీరి కేసు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.
Chennai Famiily Court
2022లోనే విడిపోతున్నట్లు ప్రకటన
వాస్తవానికి 2022 జనవరిలో నే 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నామని, తాము విడిపోతున్నామని ఇద్దరూ ప్రకటించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు.
నాడు పెట్టిన పోస్ట్ లో '18 ఏళ్లుగా తామిద్దరం స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకుని మేం ప్రయాణించాం.ఇప్పుడు అనుకోని కారణాలవల్ల తామిద్దం విడిపోవాలని నిర్ణయించుకున్నాం.' అని పేర్కొన్నారు.