Dhanush: ధనుష్ 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
'పా పాండి', 'రాయన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత, ధనుష్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తన హోమ్ బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేయనుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ఇటీవల విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
వివరాలు
సాధారణ ప్రేమకథ కాదు
ట్రైలర్ ప్రారంభంలో ధనుష్ కనిపించి,ఇది ఒక సాధారణ ప్రేమకథ అని చెప్పినప్పటికీ, కథలో అనేక మలుపులు ఉంటాయని అర్థమవుతోంది.
ప్రేమ, విరహం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని,కామెడీ,ఎమోషనల్ అంశాలతో వినోదభరితంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథ
మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి, అక్కడ ఎదురయ్యే సంఘటనలు ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ట్రైలర్ చూస్తే,ప్రస్తుత యువతను ఆకట్టుకునే స్టోరీ లైన్‌తో ధనుష్ ఈసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నారని తెలుస్తోంది.
జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్‌లోనే స్పష్టమవుతోంది.
పవిష్,అనిఖా సురేంద్రన్,ప్రియా ప్రకాష్ వారియర్,మాథ్యూ థామస్,వెంకటేష్ మీనన్,రబియా ఖాటూన్,రమ్య రంగనాథన్ వంటి నటీనటులందరికీ కీలక పాత్రలు కల్పించారని తెలుస్తోంది.
వివరాలు
ప్రత్యేక ఆకర్షణలు
ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించనుండగా, ఆమె నటించిన పాటకు సంబంధించిన చిన్న భాగం కూడా ట్రైలర్‌లో చూపించారు.
సినిమాటోగ్రఫీని లియోన్ బ్రిట్టో నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను జి.కె. ప్రసన్న చేపట్టారు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించబోతుందో చూడాలి!