LOADING...
Dhanush: రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ?.. తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలు వైరల్!
రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ?.. తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలు వైరల్!

Dhanush: రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ?.. తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో సినిమా, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజి రామచంద్రన్, జె. జయలలిత నుంచి ఇటీవల రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ప్రజా నాయకులుగా ఎదిగారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఈ చర్చకు కారణం ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన తాజా వ్యాఖ్యలే. చెన్నైలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాను ధనుష్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

వివరాలు

రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలు

రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది. భవిష్యత్తులో నా కుమారులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అని కస్తూరి రాజా వ్యాఖ్యానించారు. దీంతో ధనుష్ రాజకీయ భవిష్యత్తుపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలను బట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే కార్యక్రమంలో తన కుటుంబ సినీ ప్రయాణాన్ని, ఎదుర్కొన్న కష్టాలను కూడా కస్తూరి రాజా గుర్తు చేసుకున్నారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని, సినీ రంగంలోకి వచ్చిన తర్వాతే ఆయన పేరును ధనుష్‌గా మార్చుకున్నట్లు వెల్లడించారు.

వివరాలు

ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది

"విమానాశ్రయాల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో మా అబ్బాయిని 'ధనుష్ కె. రాజా' అని పిలుస్తుంటే నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపిస్తుందని కస్తూరి రాజా భావోద్వేగంగా చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ధనుష్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి తెరకెక్కిస్తున్న తన 55వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మరోవైపు ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement