Page Loader
Kubera Movie: ధనుష్‌-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో 'కుబేర'.. గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్
ధనుష్‌-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో 'కుబేర'.. గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

Kubera Movie: ధనుష్‌-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో 'కుబేర'.. గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటుడు ధనుష్‌ కథానాయకుడిగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'కుబేర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆనంద్‌', 'గోదావరి', 'హ్యాపీడేస్‌', 'ఫిదా', 'లవ్‌స్టోరీ' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు అందించిన శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ అగ్రనటుడు అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణేష్ చతుర్థి సందర్భంగా 'కుబేర' సినిమా టీమ్ ప్రత్యేకంగా ఒక పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ధనుష్‌, నాగార్జునలు ఉన్నారు. వీరిద్దరి లుక్‌లు డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి