Page Loader
Ilayaraja: ఇళయరాజా బయోపిక్ నుండి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించిన ధనుష్
Ilayaraja: ఇళయరాజా బయోపిక్ నుండి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించిన ధనుష్

Ilayaraja: ఇళయరాజా బయోపిక్ నుండి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించిన ధనుష్

వ్రాసిన వారు Stalin
Jun 02, 2024
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. త‌మిళ అగ్ర న‌టుడు ధనుష్‌ హీరోగా రాబోతున్న ఈ బయోపిక్‌ను 'కెప్టెన్ మిల్లర్' ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. 2024లో షూటింగ్‌ మొదలుపెట్టి.. 2025లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇప్ప‌టికే ఇళైయ‌రాజా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది.. ఇక ఈ పోస్ట‌ర్‌లో ఇళయరాజా విలేజ్ ట్రూప్‌తో క‌లిసి పాట పాడుతున్న‌ట్లు పోస్ట‌ర్ ఉంది. కాగా ఈ చిత్రంపై మ‌రిన్ని వివరాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Details 

దర్శకులు మణిరత్నం,మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు 

అంతకు ముందు దర్శకులు మణిరత్నం,మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాల ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు(జూన్ 2) కావడం విశేషంగా భావించాలి. ఈ సందర్భంగా నటులు కమల్ హాసన్ , ధనుష్ వారికి ప్రత్యేక సందేశాలతో శుభాకాంక్షలు తెలిపారు. తన దైనశైలిలో చిత్రాలను నిర్మించి దేశ వ్యాప్తంగా పొందిన దర్శకులు మణిరత్నం గుర్తింపు పొందారు. విన్నూత్నమైన సంగీతాన్ని అందించి మాస్ట్రో ఇళయరాజా గురించి వేరే చెప్పనవసరం లేదు.