తదుపరి వార్తా కథనం
Idli Kottu: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 24, 2025
11:55 am
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సూపర్ స్టార్ నటుడు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడాయ్' (తెలుగులో 'ఇడ్లీకోట్టు'). దసరా కానుకగా అక్టోబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ అక్టోబర్ 29 నుండి ఈ సినిమాను తమిళం,తెలుగు,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో స్ట్రీమ్ చేయనున్నట్టు ప్రకటించింది. సొంత ప్రొడక్షన్ హౌస్ వండర్‌బార్ ఫిల్మ్స్తో పాటు డాన్ పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది.మరోవైపు అరుణ్ విజయ్,శాలినీ పాండే,సత్యరాజ్, పర్థిబాన్,సముద్రకని,రాజ్‌కిరణ్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చగా,కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.