Anirudh Ravichander Wedding: ఒకే ఫ్రేమ్‌లో ధోనీ, అజిత్, రజినీకాంత్.. వైరల్‌గా మారిన ఫొటోలు!
ఈ వార్తాకథనం ఏంటి
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సీఈవో కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2026 నవంబర్ 11న గ్రీస్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం చెన్నైలో కావ్య-అనిరుధ్ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఇద్దరు 'తలా'లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వివరాలు
భార్యలతో కలిసి హాజరైన ధోనీ, అజిత్
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజం ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు.
నూతన దంపతులను ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ధోనీ తొలిసారిగా బహిరంగంగా కనిపించడం ఇదేనని కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. తన సతీమణి షాలినితో కలిసి వచ్చి కావ్య-అనిరుధ్‌లను ఆశీర్వదించారు.
వివరాలు
ఒకే ఫ్రేమ్‌లో ధోనీ, అజిత్, రజినీకాంత్
రిసెప్షన్‌లో ధోనీ, అజిత్ కుమార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇంతలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా వారితో జతకలిశారు.
దీంతో ముగ్గురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా రజినీకాంత్.. ఎంఎస్ ధోనీ, అజిత్ కుమార్‌లను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.