LOADING...
Dhurandhar2: ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న 'ధురంధర్‌' స్టార్
ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న 'ధురంధర్‌' స్టార్

Dhurandhar2: ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న 'ధురంధర్‌' స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్‌: ది రివెంజ్‌' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రెండు వారాలుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. అదే సమయంలో, ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు, క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బిమల్‌ ఒబెరాయ్‌కు తెలుగు చిత్రంలో నటించే అవకాశమొచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. 'ధురంధర్‌' సినిమాలో బలోచ్‌ యునైటెడ్‌ ఫోర్స్‌ నాయకుడు శ్రీరాని బలోచ్‌గా బిమల్‌ ఒబెరాయ్‌ నటించారు.

వివరాలు 

రూ.1500 కోట్ల మైలురాయి..

ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో, ఆదిత్యధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై 15 రోజులు గడిచినా సోషల్‌ మీడియాలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. ప్రీమియర్‌ షోల నుంచే రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం, 15 రోజుల్లోనే (ఏప్రిల్‌ 2 నాటికి) రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అరుదైన క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1501 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు సాధించగా, అందులో దేశీయంగా రూ.1134 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

బాలీవుడ్‌ స్టార్‌ ప్రశంసలు

'ధురంధర్‌ 2'పై వస్తున్న ప్రశంసలను విన్న బాలీవుడ్‌ అగ్రనటుడు ఆమిర్‌ఖాన్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందని, టీమ్‌ ఫలితాన్ని అందుకుందని ఆయన అభినందించారు. ఈ చిత్రంలో ఐబీ చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌ పాత్రలో నటించిన మాధవన్‌ తాజాగా ఈ సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబయిలోని ఒక థియేటర్‌లో ఆయన ఈ సినిమాను చూసినట్లు సమాచారం.

Advertisement