Sara Arjun : విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.. 'దురంధర్' భామ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన 'ధురంధర్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ, క్రమంగా హీరోయిన్‌గా ఎదుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యుఫోరియా', గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న 'మ్యాజిక్' చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'యుఫోరియా' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సారా అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను బహిర్గతం చేసింది. టాలీవుడ్ హీరోల్లో తనకు అత్యంత ఇష్టమైన నటుడు విజయ్ దేవరకొండేనని, ఆయనే తన ఫేవరెట్ హీరో అని చెప్పడంతో అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
Details
ఫిబ్రవరి 6న 'యుఫోరియా' రిలీజ్
సారా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోగా, ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కూడా ఆయన ఫ్యాన్ అని చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సారా అర్జున్ నటిస్తున్న 'యుఫోరియా' చిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది. యూత్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో సారా టాలీవుడ్‌లో గట్టి స్థానం సంపాదించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక భవిష్యత్తులో తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సారా అర్జున్ స్క్రీన్ షేర్ చేస్తుందా అనే ఆసక్తి కూడా పెరుగుతోంది.