LOADING...
Durandhar: ఓటీటీ తెరపైకి తెలుగులో 'ధురంధర్'.. ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి
ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి

Durandhar: ఓటీటీ తెరపైకి తెలుగులో 'ధురంధర్'.. ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మధ్యకాలంలో సినీ అభిమానులు ఎక్కువగా చర్చిస్తున్న చిత్రాల్లో 'ధురంధర్' ప్రత్యేక స్థానం సంపాదించింది. సోషల్ మీడియా వేదికల నుండీ, సినిమాహాళ్ల వరకు.. ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. విడుదలకు ముందే పోస్టర్స్ ద్వారా పెద్ద హైప్ సృష్టించిన ఈ సినిమా, విడుదల తరువాత సంచలనానికి సరైన అర్థం చెప్పింది. రణ్ వీర్ సింగ్ కెరీర్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాగా ఇది నిలిచిపోయింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలోనూ 'ధురంధర్' ఒకటిగా చోటు చేసుకుంది.

వివరాలు 

రికార్డు స్థాయిలో 1300 కోట్ల వసూళ్లు

డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుండే ప్రేక్షకుల జోరును ఆకట్టుకోవడం ప్రారంభించింది. ఇటీవల, సీనియర్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన విజయం పొందలేకపోయాయి. అలాగే ఇది కూడా భారీతనంతో సందడి చేసే ఒక సినిమా అనుకున్నారు. అయితే బలమైన కథా నిర్మాణం, ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత, ఖచ్చితమైన కథా ప్రవాహం వల్లే ఈ సినిమా అసలైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా, 1300 కోట్ల మార్క్‌ను తాకుతూ రికార్డులు సృష్టించింది.

వివరాలు 

ఓటీటీ హక్కులు దక్కించుకున్న 'నెట్ ఫ్లిక్స్'

ఈ సినిమాకు తెలుగు వెర్షన్ వస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అయితే, సినిమా కధ, విజువల్స్, ప్రదర్శన ఇలా ప్రతి అంశం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల 30వ తేదీ నుండి 'నెట్‌ ఫ్లిక్స్'లో 'ధురంధర్' ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 280 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీతో పాటు ఇతర భాషలలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

Advertisement