LOADING...
Dhurandhar: 'ధురంధర్' చిత్ర యూనిట్‌లో వివాదం.. లైంగిక వేధింపుల ఆరోపణలు
'ధురంధర్' చిత్ర యూనిట్‌లో వివాదం.. లైంగిక వేధింపుల ఆరోపణలు

Dhurandhar: 'ధురంధర్' చిత్ర యూనిట్‌లో వివాదం.. లైంగిక వేధింపుల ఆరోపణలు

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ధురంధర్ సినిమాకు సంబంధించిన ఓ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన సైనీ జోహ్రేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.

వివరాలు

కేసు నమోదు చేసిన పోలీసులు..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, గత సంవత్సరం సెప్టెంబర్ 10న సినిమా పనులకు సంబంధించిన చర్చల కోసం సైనీ జోహ్రే తనను చండీగఢ్‌లోని ఓ హోటల్‌కు రావాలని కోరారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. ఆరోగ్యం బాగోలేకపోయినా అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని బయటకు చెబితే తన సినీ భవిష్యత్తుపై ప్రభావం పడేలా చేస్తానని బెదిరించినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement