DPIFF Awards 2026: 'ధురంధర్'కు అత్యధిక అవార్డులు.. కమల్ హాసన్, ఇళయరాజాకు ప్రత్యేక గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ, అంతర్జాతీయ సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్, సంగీతం, షార్ట్ ఫిల్మ్స్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)అవార్డ్స్ 2026ను ప్రకటించారు. మొత్తం 41విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తూ సినీ, వినోద రంగాల్లో ప్రతిభను గుర్తించారు. ఈ ఏడాది అవార్డుల్లో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' అత్యధిక పురస్కారాలతో సత్తా చాటింది. 'కాంతార: చాప్టర్ 1', 'సయ్యారా' చిత్రాలు కూడా కీలక విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి. అంతర్జాతీయ విభాగంలో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ప్రత్యేక గౌరవాలను అందుకున్నారు. భారతీయ సినీ, సంగీత రంగాలకు చేసిన విశేష సేవలకు గాను కమల్ హాసన్, ఇళయరాజా ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
వివరాలు
భారతీయ చలనచిత్ర విభాగం
ఉత్తమ చిత్రం: ధురంధర్ (Dhurandhar)
ఉత్తమ నటుడు: రణ్‌వీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సయ్యారా)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)
క్రిటిక్స్ ఉత్తమ చిత్రం: కాంతార: చాప్టర్ 1
క్రిటిక్స్ ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1)
క్రిటిక్స్ ఉత్తమ నటి: యామీ గౌతమ్ ధర్(హక్)
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేశ్ ధర్(ధురంధర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: అరవింద్ ఎస్. కశ్యప్(కాంతార: చాప్టర్1)
ఉత్తమ కొరియోగ్రాఫర్: శాండీ మాస్టర్ (కూలీ-మోనికా పాట)
ఉత్తమ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: రేషు నాథ్(హక్)
ఉత్తమ సహాయ నటుడు: వినీత్ కుమార్ సింగ్(ఛావా)
ఉత్తమ ప్రతినాయకుడు: అక్షయ్ ఖన్నా(ధురంధర్)
ఉత్తమ హాస్యనటుడు: రితేష్ దేశ్‌ముఖ్(హౌస్‌ఫుల్ 5)
వివరాలు
సంగీతం, వినోద విభాగం
సంగీతం, వినోద రంగాల్లోనూ పలువురు ప్రముఖులు అవార్డులను అందుకున్నారు.
ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సయ్యారా - టైటిల్ ట్రాక్)
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: కరణ్ ఔజ్లా
సాంగ్ ఆఫ్ ది ఇయర్: సయ్యారా (సయ్యారా చిత్రం)
కమెడియన్ ఆఫ్ ది ఇయర్: సమయ్ రైనా
ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: ఫహీమ్ అబ్దుల్లా (సయ్యారా - టైటిల్ ట్రాక్)
వివరాలు
కమల్ హాసన్, ఇళయరాజాకు జీవిత సాఫల్య పురస్కారాలు
ప్రత్యేక గౌరవాల విభాగంలో ముగ్గురు ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రకటించారు.
సంగీత పరిశ్రమకు విశేష సేవలు: ఇళయరాజా
చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు: కమల్ హాసన్
ప్రపంచ సినిమాకు విశేష సేవలు: జేమ్స్ కామెరూన్
వివరాలు
వెబ్ సిరీస్, టెలివిజన్ విభాగం
ఉత్తమ వెబ్ సిరీస్: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్
ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు: ఆర్యన్ ఖాన్(ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు: జైదీప్ అహ్లావత్(పాతాళ్ లోక్ సీజన్ 2)
ఉత్తమ వెబ్ సిరీస్ నటి: షెఫాలీ షా(ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు - వెబ్ సిరీస్: వినయ్ పాఠక్(గ్రామ్ చికిత్సాలయ్)
ఉత్తమ ప్రతినాయకి - వెబ్ సిరీస్: హుమా ఖురేషి(ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: తారక్ మెహతా కా ఊల్తా చష్మా
ఉత్తమ టెలివిజన్ నటుడు: అమర్ ఉపాధ్యాయ్(క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2)
వివరాలు
అంతర్జాతీయ సినిమా, షార్ట్ ఫిల్మ్స్ విభాగం
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash)
ఉత్తమ అంతర్జాతీయ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ అంతర్జాతీయ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ అంతర్జాతీయ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)
ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: టేలర్ స్విఫ్ట్ - ఉత్తమ షార్ట్ ఫిల్మ్: మాధురి
ఎండ్ ఈజ్ బిగినింగ్ (సయ్యద్ షాహిద్ ఖాన్) - ఫస్ట్ రన్నరప్: జహాన్
ది లాస్ట్ గిఫ్ట్ (రాహుల్ శెట్టి) - సెకండ్ రన్నరప్: ఇన్ హాఫ్ (జార్జ్ మోరైస్)
థర్డ్ రన్నరప్: టీ కొట్టు'83 (సాయి హరిణి వసంత్)