Page Loader
Mohan Babu:'ది ప్యారడైజ్'లో విలన్‌గా డైలాగ్ కింగ్.. మోహన్ బాబు-నాని మధ్య హై వోల్టేజ్ సీన్స్ 
'ది ప్యారడైజ్'లో విలన్‌గా డైలాగ్ కింగ్.. మోహన్ బాబు-నాని మధ్య హై వోల్టేజ్ సీన్స్

Mohan Babu:'ది ప్యారడైజ్'లో విలన్‌గా డైలాగ్ కింగ్.. మోహన్ బాబు-నాని మధ్య హై వోల్టేజ్ సీన్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

'దసరా' సినిమా విజయంతో నేచురల్ స్టార్ నాని మరో మైలురాయిని సాధించారు. ఈ సక్సెస్ తర్వాత, నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలపనున్నారు. వారి కాంబినేషన్లో రాబోతున్న తాజా ప్రాజెక్ట్‌కి 'ది ప్యారడైజ్' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ విడుదల కాగా, ఇది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ముఖ్యమైన ప్రాధాన్యత ఉందట.

Details

మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

ఈ పాత్ర కోసం మేకర్స్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబును సంప్రదించగా, ఆయన కూడా తక్షణమే అంగీకరించారని సమాచారం. మంచు మోహన్ బాబు, నాని మధ్య సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం భావిస్తోంది. 'దసరా' వంటి హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా, భారీ అంచనాలు తెరకెక్కిస్తున్నారు. నాని అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.