
అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి కనీసం ఫస్ట్ లుక్ కూడా రాలేదు. సినిమా అనౌన్స్ చేసినపుడు వచ్చిన ప్రభాస్ ఫోటోలు, షూటింగ్ లోకేషన్ నుండి లీకైన ఫోటోలు తప్ప చిన్న గ్లింప్స్ లాంటివి రిలీజ్ కాలేదు.
గతకొన్ని రోజులుగా అప్డేట్స్ గురించి అభిమానులు అడుగుతూనే ఉన్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్, తన ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసాడు.
నిర్మాత విజయ్ కిరంగదుర్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేసాడు. వీళ్ళిద్దరూ ఒకేసారి ఇలా చేయడానికి కారణం అభిమానుల నుండి అప్డేట్స్ అంటూ వస్తున్న ఒత్తిడే కారణమని అంటున్నారు.
Details
సెప్టెంబర్ 28వ తేదీన పక్కాగా రిలీజ్
సలార్ సినిమా అప్డేట్స్ ఇవ్వమని అటు ప్రశాంత్ నీల్ ని, ఇటు విజయ్ కిరంగదుర్ ని అడుగుతున్నారు.
ఈ ఒత్తిడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. కొన్నిసార్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ని చెడమాడా తిట్టేస్తున్నారు కూడా. అందుకే, ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకున్నారని చెబుతున్నారు.
మరి ఈ విషయంలో నిజమేంటో దర్శకుడు, నిర్మాత స్పందిస్తేనే అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే, సలార్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు పుకార్లు కూడా వచ్చాయి. ఈ విషయమై స్పందించిన నిర్మాణ సంస్థ, అనుకున్న తేదీ ప్రకారం, సెప్టెంబరు 28న సలార్ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది.
సలార్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది.