GameChanger: 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీపై స్పష్టతనిచ్చిన దిల్‌రాజు.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.
కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై అనేక వార్తలొచ్చాయి. మొదట క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్నారు.
కానీ అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
దిల్ రాజు ఈ విషయంపై స్పందించారు. 'గేమ్ చేంజర్' సంక్రాంతికి రావడం వల్ల 'విశ్వంభర'ను మరో డేట్‌కు రిలీజ్ చేస్తామన్నారు. నిజానికి 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు వచ్చాయని చెప్పారు.
Details
సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్
తన కోసం తమ చిత్రాన్ని వేరే డేట్‌కు రిలీజ్ చేయడానికి అంగీకరించినందుకు మెగాస్టార్ చిరంజీవి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ప్రత్యేక ధన్యవాదలని చెప్పారు.
'గేమ్ చేంజర్' సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నామని దిల్ రాజ్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది.
ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అభిమానుల్లో మంచి హిప్ క్రియేట్ చేశాయి. త్వరలో టీజర్, మిగిలిన పాటలను కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.