Dil Raju: యశ్ 'టాక్సిక్'పై దిల్ రాజు భారీ పందెం.. తెలుగు హక్కులకు ఏకంగా రూ.120 కోట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా భారీ నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన 'టాక్సిక్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు సంబంధించి దిల్ రాజు చేసిన పెట్టుబడి ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సుమారు రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.
వివరాలు
రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి
తెలుగు హీరో నటించని సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో డీల్ జరగడం చాలా అరుదైన విషయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
యశ్‌కు ఉన్న క్రేజ్, 'టాక్సిక్'పై నెలకొన్న హైప్‌పై నమ్మకంతోనే మేకర్స్ అడిగిన మొత్తానికి దిల్ రాజు ఎలాంటి సందేహం లేకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ డీల్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే సినిమాపై భారీ బజ్ ఉండటంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన కూడా ఆశాజనకంగా ఉందని తెలుస్తోంది.
వివరాలు
'టాక్సిక్' భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం
దీనికి లాంగ్ వీకెండ్ కూడా కలిసిరావడంతో 'టాక్సిక్' భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
యశ్‌తో భవిష్యత్తులో తాను నేరుగా ఓ తెలుగు సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ముందుగా కథ నచ్చాల్సి ఉంటుందని, ఆ తర్వాతే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది నిర్ణయిస్తామని తెలిపారు.
దీంతో యశ్‌తో దిల్ రాజు నిర్మించబోయే తెలుగు సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు 'టాక్సిక్' తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.