Allu Arjun: 'రావణం' ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్.. ప్రశాంత్ నీల్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు
ఈ వార్తాకథనం ఏంటి
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప 2' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను దక్కించుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీతో కలిసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అదే స్థాయి ప్రాజెక్టులను ఎంపిక చేసుకునే దిశగా బన్నీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్', 'సలార్' వంటి భారీ విజయాలతో బాక్సాఫీస్ రికార్డులను మార్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ కలిసి పనిచేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గురించి అభిమానుల్లో ఆసక్తి ఉండగా, ఇప్పుడు అది నిజం అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
గట్టి ప్లాన్ వేసిన దిల్ రాజు..
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు సెటప్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'రావణం' అనే పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇదే టైటిల్‌తో గతంలో ప్రభాస్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని దిల్ రాజు భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రణాళిక మారి ఇప్పుడు అల్లు అర్జున్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
రావణుడి పాత్రలో బన్నీ..
ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను పురాణాల్లోని రావణుడి లక్షణాలను ప్రతిబింబించే శక్తివంతమైన, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో చూపించనున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన మాస్ ప్రెజెంటేషన్‌తో పాటు బన్నీ స్టైల్ కలిస్తే, ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్తో చేస్తున్న ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశముంది. సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ద త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.