Page Loader
Dipika Kakar: ప్రాణాంతక లివర్‌ క్యాన్సర్‌ బారిన పడిన దీపికా కాకర్‌.. సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌
ప్రాణాంతక లివర్‌ క్యాన్సర్‌ బారిన పడిన దీపికా కాకర్‌..

Dipika Kakar: ప్రాణాంతక లివర్‌ క్యాన్సర్‌ బారిన పడిన దీపికా కాకర్‌.. సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్‌ ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గత కొంతకాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా, చికిత్స తీసుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోగా మరింతగా పెరుగుతూ వచ్చింది. దీంతో స్కానింగ్‌ చేయించగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి ప్రమాదకరమైన దశలో ఉందని వైద్యులు స్పష్టం చేశారు. పరీక్షల అనంతరం దీపికాకు స్టేజ్ 2 స్థాయిలో లివర్ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు తెలిపారు.

వివరాలు 

 ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ ద్వారా అభిమానులకు.. 

ఈ విషయాన్ని దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. "గత కొన్ని వారాలుగా నేను ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నా కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి ఉండటంతో ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. వైద్య పరీక్షల సందర్భంగా, కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితిని గుర్తించారు. అది ప్రమాదకర దశలో ఉంది. వైద్యులు దీన్ని స్టేజ్ 2 లివర్ క్యాన్సర్‌గా గుర్తించారు. ఈ తీవ్రమైన వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొనే నిర్ణయం తీసుకున్నాను. దేవుని అనుగ్రహంతో పాటు, నా అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమతో ఈ కష్టాన్ని అధిగమిస్తానని నమ్ముతున్నాను," అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

వివరాలు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి నుంచి తపించుకున్న దీపికా కాకర్‌ కుటుంబం

దీపికా పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి దీపికా కాకర్‌ కుటుంబం తప్పించుకున్న విషయం విదితమే. గత నెలలో దీపికా తన భర్త షోయబ్ ఇబ్రహీం‌తో కలిసి జమ్ముకశ్మీర్‌ వెళ్ళారు. వారు బైసరాన్ వ్యాలీను సందర్శించారు. అక్కడి పర్యటనను ముగించి కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతంలో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన గురించి దీపికా-షోయబ్ దంపతులు కూడా తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రాణాంతక లివర్‌ క్యాన్సర్‌ బారిన పడిన దీపికా కాకర్‌