Page Loader
తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు 
ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు

తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo, Bloody Sweet). ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌ కీలక పాత్రలు పోషించడం తెలిసిందే. అయితే తాజాగా మరో దర్శకుడు ఈ మూవీలో భాగం కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌ విజయ్ తళపతితో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే చిత్ర నిర్మాణ బృందం లాంఛ్ చేసిన లియో టైటిల్‌ ప్రోమో గ్లింప్స్, లియో ఫస్ట్ లుక్ నెట్టింట సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

DETAILS

ఒకే సినిమాలో కలిసి నటిస్తున్న ప్రముఖ నటీ నటులు

ఒకే సినిమాలో స్టార్ హీరో విజయ్ లీడ్ రోల్‌ చేస్తుండగా, ముగ్గురు దిగ్గజ దర్శకులు మిస్కిన్‌, గౌతమ్‌ మీనన్‌, అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. మరోవైపు స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో ఆయా వ్యక్తులు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటం పట్ల అంచనాలు విపరీతంగా పెరిగాయి. విజయ్‌ సుత్తె పట్టుకొని యాక్షన్‌ ఫోజుతో ఉన్న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు మంచి స్పందన వస్తోంది. దళపతి విజయ్‌, అనిరుధ్‌ రవిచందర్ కలిసి పాడిన నా రెఢీ పాట నెట్టింట సందడి చేస్తోంది. త్రిష, సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్‌, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, మాథ్యూ థామస్‌, సాండీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.