LOADING...
Rajnikanth : 'తలైవర్ 173' నుంచి షాకింగ్ అప్‌డేట్.. ఆ దర్శకుడు తప్పుకున్నారా..?
'తలైవర్ 173' నుంచి షాకింగ్ అప్‌డేట్.. ఆ దర్శకుడు తప్పుకున్నారా..?

Rajnikanth : 'తలైవర్ 173' నుంచి షాకింగ్ అప్‌డేట్.. ఆ దర్శకుడు తప్పుకున్నారా..?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైలర్ 2'లో నటిస్తున్నారు. ఇదే సమయంలో తన 173వ చిత్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక కీలక మార్పు తాజాగా వెలుగులోకి వచ్చింది. మొదట ఈ 'తలైవర్ 173' చిత్రానికి 'డాన్' సినిమాతో గుర్తింపు పొందిన సిబి చక్రవర్తి దర్శకుడిగా ఎంపికయ్యారు. రజనీకాంత్ కూడా ఆయన చెప్పిన కథకు ఆకర్షితులయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఆయన ఈ చిత్రాన్ని వదిలేసినట్లు సమాచారం.

వివరాలు

ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ..

ఇక సిబి స్థానంలో కొత్తగా 'ఓ మై కడవులే'తో పేరు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ తాను రజనీకాంత్‌కు ఇప్పటికే ఒక ఆసక్తికరమైన కథను వినిపించానని, ఆ కథ సూపర్ స్టార్‌కు ఎంతో నచ్చిందని తెలిపారు. ఆయన కథ చెప్పే విధానం, మేకింగ్‌లో ఉన్న ప్రత్యేకత రజనీకాంత్‌ను మెప్పించిందని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆయననే దర్శకుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

 మూవీపై భారీ అంచనాలు..

అయితే ఈ మార్పులపై చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ అశ్వత్ మరిముత్తు - రజనీకాంత్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లే అనిపిస్తున్నది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement