తదుపరి వార్తా కథనం

Krish : డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. నిర్ధారించిన పోలీసులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 27, 2024
01:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయన ఫ్రెండ్ గజ్జల వివేక్ ఇచ్చిన పార్టీకి డైరెక్టర్ క్రిష్ హాజరైనట్లు పోలీసులు వెల్లడించారు.
దీని పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.
డ్రగ్స్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు.ఫ్రెండ్స్‌తో డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు గజ్జల వివేకానంద అంగీకరించారు.
నిర్భయ్, రఘుచరణ్, కేదార్,సందీప్,శ్వేత,లిశి,నీల్,క్రిష్‌లతో కలిసి వివేకానంద డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు.
సయ్యద్ అబ్బాస్ జఫ్రీ దగ్గర డ్రగ్స్ కొన్నట్లు పోలీస్ విచారణలో వివేకానంద చెప్పినట్లు సమాచారం.