Drugs: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ముగ్గురు
హైదరాబాద్,గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో ఆదివారం రాత్రి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఓ రాజకీయ నేత కుమారుడు కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీ మొత్తంలో సైకోట్రోపిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి విందు సమయంలో అధికారులు ఆ ప్రాంగణంలో దాడి చేసి, అనుమానితుల నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ పార్టీకి చెందిన యోగానంద కుమారుడు వివేకానంద డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడిన్నట్లు సమాచారం. అంతేకాకుండా రైడ్ చేరిన హోటల్ కూడా బిజెపి నేత యోగానంద్ కావడం గమనార్హం.