LOADING...
Karisma Kapoor: తండ్రి వీలునామాపై వివాదం.. దిల్లీ హైకోర్టును అశ్రయించిన కరిష్మా కపూర్‌ పిల్లలు!
తండ్రి వీలునామాపై వివాదం.. దిల్లీ హైకోర్టును అశ్రయించిన కరిష్మా కపూర్‌ పిల్లలు!

Karisma Kapoor: తండ్రి వీలునామాపై వివాదం.. దిల్లీ హైకోర్టును అశ్రయించిన కరిష్మా కపూర్‌ పిల్లలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ (Karisma Kapoor) పిల్లలు సమైరా, కియాన్‌ (Samiera, Kiaan) దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి, వ్యాపారవేత్త దివంగత సంజయ్‌ కపూర్‌ (Sunjay Kapur) వీలునామా విషయంలో సవతి తల్లి ప్రియ సచ్‌దేవ్‌ (Priya Sachdev) మోసం చేసిందని పిటిషన్‌లో ఆరోపించారు. సంజయ్‌ రాసిన అసలు వీలునామాను దాచిపెట్టి, నకిలీ డాక్యుమెంట్‌ను ఇటీవల జరిగిన కుటుంబ సమావేశంలో ప్రియ చూపించిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా, తమ తండ్రి మరణం తర్వాత ఆస్తి వివరాలు చెప్పడానికిగానీ, సంబంధిత పత్రాలను చూపడానికిగానీ ఆమె నిరాకరించిందని పిల్లలు పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాను ఇప్పించాలని వారు హైకోర్టు ద్వారా డిమాండ్‌ చేశారు.

Details

2003లో సంజయ్-కరిష్మా వివాహం

ఇక ఈ ఆరోపణలపై సంజయ్‌ సోదరి మందిర కపూర్‌ (Mandira Kapoor) కూడా స్పందించారు. ప్రియ సచ్‌దేవ్‌తో పాటు పలువురు వ్యక్తులు తమ తల్లి సంతకాలను బలవంతంగా తీసుకున్నారని ఆమె మీడియాకు తెలిపారు. సంజయ్‌ కపూర్‌ ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు ఉంటుందని సమాచారం. గమనించదగ్గ విషయం ఏంటంటే, 2003లో సంజయ్‌-కరిష్మా వివాహం చేసుకున్నారు. కానీ, వారి సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సంజయ్‌, ప్రియ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జూన్‌లో సంజయ్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణానంతరం ఆస్తి హక్కులపై కపూర్‌ కుటుంబంలో వివాదం చెలరేగి ఇప్పుడు న్యాయపరమైన దశకు చేరుకుంది.