Page Loader
Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!
బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!

Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ అగ్ర ఫేవ‌రెట్ షో బిగ్‌ బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది. ఇప్ప‌టివరకు బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, కిరాక్ సీత, గ‌త వారం నాగ‌మ‌ణికంఠ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం హౌజ్ నుంచి ఎవరికి ఎలిమినేషన్ జరుగుతుందనే విషయంపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ వారం నామినేష‌న్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉండగా, ప్రేరణ రెండో స్థానంలో నిలిచింది.

Details

డేంజ‌ర్ జోన్‌లో మెహబూబ్, నయని పావని

మెగా చీఫ్‌గా ఉన్న విష్ణుప్రియ మూడు, పృథ్వీ నాలుగు స్థానాల్లో ఉన్నారు. తక్కువ ఓటింగ్ కారణంగా డేంజ‌ర్ జోన్‌లో మెహబూబ్, నయని పావనిలు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారో రేపు తెలనుంది. దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా విడుదలైన ప్రోమోలో, హౌజ్‌మేట్స్ అందరూ కలిసి దీపావ‌ళి సంబరాల్లో పాల్గొన్నట్లు చూపించారు. ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సాయి ప‌ల్ల‌వి, శివ కార్తికేయ‌న్, దుల్కర్ సల్మాన్, వెంకి అట్లూరి, అనసుయ, కిర‌ణ్ అబ్బ‌వ‌రం, నయన్ సారిక హౌజ్‌లోకి రావడంతో, అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.