Peddi Movie : చికిరి సాంగ్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో తెలుసా.. మేకింగ్ వీడియోతో అభిమానులు ఫిదా!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్‌ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' నుంచి వెలువడే ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పోస్టర్ అయినా ఒక గ్లింప్స్ అయినా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పాటలతో ప్రేక్షకుల్లో భారీ బజ్‌ను సృష్టించింది.
Details
యూట్యూబ్‌లో చికిరి' సాంగ్ సంచలనం
ఇక తాజాగా విడుదలైన 'చికిరి' పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్ 100 మిలియన్ల వ్యూస్‌ను దాటడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే హైప్‌ను కొనసాగిస్తూ మేకర్స్ 'చికిరి' సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకింగ్ వీడియోలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, సినిమా యూనిట్‌తో కలిసి సుమారు 45నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తూ కొండపై ఉన్న లొకేషన్‌కి చేరుకున్న విధానాన్ని చూపించారు. ట్రెక్కింగ్ సమయంలో రామ్ చరణ్ అలసిపోయి మధ్యలో ఆగిన తర్వాత మళ్లీ ముందుకు సాగడం వీడియోలో ప్రధాన హైలైట్‌గా కనిపిస్తోంది.
Details
అందమైన లోకేషన్ లో పాట చిత్రీకరణ
వీడియో చివర్లో బుచ్చిబాబు-రామ్ చరణ్ మధ్య 'చిరుత' సినిమా గురించి జరిగిన చిన్న సంభాషణ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. మహారాష్ట్రలోని పుణే - సవల్య ఘాట్ ప్రాంతంలోని ఎత్తైన కొండల్లో, పచ్చదనంతో నిండిన అందమైన లొకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. అక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో యూనిట్ మొత్తం ట్రెక్కింగ్ ద్వారానే లొకేషన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. చరణ్, జాన్వీతో పాటు యూనిట్ సభ్యులంతా కొండపైకి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు మేకింగ్ వీడియోలో ప్రత్యేకంగా నిలిచాయి. ప్రస్తుతం'చికిరి' మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, రామ్ చరణ్ శ్రమ, బుచ్చిబాబు సనా నిబద్ధత, అద్భుతమైన లొకేషన్ మొత్తం కలిసి 'పెద్ది'పై మరింత హైప్‌ను పెంచాయి. ఇప్పుడు అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.