Page Loader
Rajamouli : రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?
రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?

Rajamouli : రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా అంటే బడ్జెట్ దాదాపు వందల కోట్లలో ఉంటుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎదురు చూస్తుంటారు. కానీ ఒక్కప్పుడు ఆయన కూడా తన కెరీర్‌ను చాలా సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టారన్న విషయం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇటీవల నాగార్జున, ధనుష్‌ కలిసి నటించిన 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ రాజమౌళిని సరదాగా ఒక ప్రశ్న అడిగారు. మీ మొదటి జీతం ఎంత, ఎవరి నుంచి తీసుకున్నారని ప్రశ్నించగా, ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.

Details

మొదటి సంపాదన రూ.50వేలు మాత్రమే

అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నప్పుడు నాకు అందిన మొదటి జీతం రూ.50 మాత్రమే. అదే నా జీవితంలో మొదటి సంపాదన అని రాజమౌళి చెప్పారు. రాజమౌళి కెరీర్‌ ప్రారంభం చిన్న స్క్రీన్ నుంచే. మొదట టీవీ సీరియల్స్‌ డైరెక్షన్‌ చేశారు. ఆ తర్వాత సినిమాల వైపు అడుగుపెట్టి, అసాధారణమైన విజయం సాధించారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో కలిసి భారీ బడ్జెట్‌ అడ్వెంచర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా 'కుబేర' చిత్రం జూన్ 20న విడుదల కాబోతోంది. దీని ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగానే రాజమౌళి ఈ అనుభవాలను గుర్తుచేసుకున్నారు.