Loading...
Vishwanath and Sons OTT : 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఇదిగో క్లారిటీ!
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఇదిగో క్లారిటీ!

Vishwanath and Sons OTT : 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఇదిగో క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఏ ఓటీటీలో అంటే?

థియేటర్లలో విడుదలైన రోజే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ ఎవరో కూడా తెలిసిపోయింది.

'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్‌ కార్డులోనే మేకర్స్‌ వెల్లడించారు.

అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే తేదీపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత నెల రోజులకు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అంటే సెప్టెంబరు మధ్యలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధికారిక స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.

ADVERTISEMENT