Sobhita Chaitanya wedding: చైతన్య-శోభిత వివాహ వేడుకకు హాజరయ్యే స్టార్ గెస్ట్స్ ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకకు మరికొన్ని గంటలే మిగిలాయి. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 'పుష్ప2' సినిమాతో ప్రేక్షకులను మరొకసారి అలరించేందుకు సిద్ధంగా ఉన్న అల్లు అర్జున్ తన కుటుంబంతో ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. అగ్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ ప్రముఖులు ఈ వేడుకలో భాగస్వాములవుతారని తెలిసింది . పెళ్లి వేడుకకు ముందు శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు.
స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న నాగార్జున
ఈ సందర్భంలో శోభిత సంప్రదాయ చీర కట్టులో ఎంతో అందంగా మెరిసిపోతూ సిగ్గు పడి కనిపించారు. ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి కోసం శోభిత తన తల్లితో కలిసి షాపింగ్ చేసినట్లు సమాచారం. నాగార్జున శోభితకు ఖరీదైన కానుకను ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వివాహం కోసమే నాగచైతన్య ఇటీవల టయోటా లెక్సస్ వాహనాన్ని రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారని, ఈ వాహనం శోభితకు బహుమతిగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.