
Nagachaitanya:నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్?
ఈ వార్తాకథనం ఏంటి
గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.
తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. తాను 2013లో 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను కొనుగోలు చేశానని, వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం "ఇవి ఇవ్వాలా లేదా" అనే ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. ఇప్పటికే చాలామంది ఈ మేరకు ఓటింగ్ చేయడానికి ముందుకు వచ్చారు.
అయితే, సాధారణంగా ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి హ్యాక్ చేసిన తర్వాత హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు.
వివరాలు
2017లో ఈ నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం
ఈ నేపథ్యం లో, ఈ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ 2.6 మిలియన్ ఫాలోవర్లతో రన్ అవుతోంది, ఆయన 2017లో ఈ అకౌంట్‌ను ప్రారంభించారు.
నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాగ చైతన్య అకౌంట్ లో వైరల్ అవుతున్న ట్వీట్ ఇదే
I bought 100 BTC in 2013 with 50$ , which are now worth $6 million. What do you think about doing a giveaway? Vote :)
— chaitanya akkineni (@chay_akkineni) October 9, 2024