Vijay Devarakonda: 'మోసపోకండి. నేను మూర్ఖుడిని కాదని' చెప్పిన విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హీరో విజయ్ దేవరకొండ సూచించారు.
ఫేక్ కాల్స్, మెసేజ్‌లపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తన స్నేహితుడి జరిగిన అనుభవాన్ని ఉదహరిస్తూ యూపీఐ పేమెంట్స్ సురక్షితంగా ఉండాలని తెలిపారు.
ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే.. తాను మూర్ఖుడిని కాదని చెప్పాలని ఆయన సూచించారు.
డబ్బులు అడిగే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినట్లు వచ్చే మెసేజ్‌లపై నిర్ధారితంగా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసుకోవాలని తెలిపారు.
Details
ఈ ఏడాది వేసవిలో వీడీ12 రిలీజ్
సినిమా పరిశ్రమ విషయానికొస్తే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'వీడీ 12' (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు.
ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.
అలాగే రవికిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మరికొన్ని చిత్రాల్లో ఆయన నటించే అవకాశం ఉంది.