Game Changer: 'గేమ్ ఛేంజర్' నుంచి 'దోప్' సాంగ్ విడుదల
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గేమ్ ఛేంజర్' నుంచి కొత్త లిరికల్ సాంగ్ 'దోప్' విడుదలైంది. ఈ పాటను డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర బృందం ఆవిష్కరించింది. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజని కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ పాట విడుదలతో 'గేమ్ ఛేంజర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.