Page Loader
Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు 
Double Ismart Movie : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు

Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
07:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టో చెప్పనక్కర్లేదు. అయితే రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటన చేశారు. మరి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ముహూర్తం ఎప్పుడు? అంటే. జూలై 9న 'డబుల్ ఇస్మార్ట్'కు పూజ చేయనున్నారని సమాచారం. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ కు 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

DETAILS

జులై 12 నంచి డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

వచ్చే ఏడాది మార్చి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని వెల్లడించారు. అయితే జులై నెలలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. జూలై 7న పూజా కార్యక్రమాలతో 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత 5 రోజులకు సెట్స్ మీదకు వెళ్లనుంది. జూలై 12 నుంచి 'డబుల్ ఇస్మార్ట్' రెగ్యులర్ షూటింగ్ జోరందుకోనుందని సమాచారం. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి ఛార్మీ కౌర్ తో కలిసి పూరీ జగన్నాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామన్నారు. 'ఇస్మార్ట్ శంకర్'లో హైదరాబాదీగా రామ్ హల్ చల్ చేశారు. తెలంగాణ యాసలో ఆయన పలికిన డైలాగులు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి.