Page Loader
బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల 
రామ్ తొలి పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు

బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో నిర్మిస్తున్న చిత్రానికి స్కంద టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రామ్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.మాస్ లుక్ తో మెరిపిస్తున్న రామ్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించాడు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా తాజా పోస్టర్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ బృందం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాస్ గ్లింప్స్ : రామ్ కొత్త సినిమా పేరు స్కంద