Loading...
Drishyam 3 OTT Release: ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్‌ దృశ్యం 3... రిలీజ్‌ ఎప్పుడంటే
ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్‌ దృశ్యం 3... రిలీజ్‌ ఎప్పుడంటే

Drishyam 3 OTT Release: ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్‌ దృశ్యం 3... రిలీజ్‌ ఎప్పుడంటే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నవంబర్ 27 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా మొదట పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదలైన తర్వాత కథలోని మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

Details

రూ.580 కోట్లకు పైగా వసూళ్లు

సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

దీంతో ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. సినిమా కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ముఖ్యంగా క్లైమాక్స్‌ వరకు ఉత్కంఠను కొనసాగించడమే ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది.

దీంతో థియేటర్లలో సినిమాను చూసిన వారితో పాటు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.

Details

హిందీలోనే ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.

నవంబర్ 27, శుక్రవారం నుంచి సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించిన సమాచారమే అధికారికంగా వెల్లడైంది.

థియేటర్లలోనూ ఈ చిత్రం హిందీలోనే విడుదలైంది. సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భవిష్యత్తులో తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఓటీటీ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT

Details

భారీ తారాగణంతో సినిమా

'దృశ్యం 3'కు అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వం వహించారు. పనోరమా స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, స్టార్ స్టూడియో 18 సమర్పించింది.

అజయ్‌ దేవగణ్‌తో పాటు జైదీప్‌ అహ్లావత్‌, శ్రియా సరన్‌, ఇషితా దత్తా, టబు, రజత్‌ కపూర్‌, ప్రకాశ్‌ రాజ్‌, మృణాల్‌ జాదవ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇప్పుడు థియేటర్లలో మిస్‌ అయిన ప్రేక్షకులకు నవంబర్ 27 నుంచి ఇంట్లోనే ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కనుంది.

ADVERTISEMENT